గొంగడి త్రిషకు ప్రభుత్వం రూ. కోటి నజరానా
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/rs1crore-to-gongadi-thrisa.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ లో రాణించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి నజరానా ప్రకటించింది. త్రిష బుధవారం సిఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రిషను అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి రూ. కోటి నజరానా ప్రకటించారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని సిఎం ఆకాక్షించారు.
అండర్-19 మహిళల టి20 ప్రపంచకప్ లో భారత్ దక్షణాఫ్రికాపై ఘన విజయంతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గొంగడి త్రిష దూకడైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ సిరీస్ వరించింది