సిరాజ్‌కు నగరంలో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం: సిఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): టి20 ప్రపంచకప్ సాధించిన టీమ్ ఇండియాకు నజరానాలు అందుతూనే ఉన్నాయి. తాజాగా మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. సిఎం రేవంత్‌రెడ్డిని సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్ ను సిఎం అభినందించారు. నగర పరిసర ప్రాంతాల్లో సిరాజ్‌కు ఇంటిస్థలం, ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించి, అధికారులను ఆదేశించారు.
టి20 ప్రపంచకప్ సాధించిన టీమ్ ఇండియా జట్టుకు ఫ్రైజ్‌మనీతో పాటు బిసిసిఐ రూ.125 కోట్లు ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.