తన సేవింగ్స్ మొత్తాన్ని విపత్తు నిధికి ఇచ్చిన సిఎం !

సిమ్లా (CLiC2NEWS): హిమాచల్‌ప్రదేశ్ ఇటీవల వరదలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులకు సాయం అందించేందుకు ఇతర రాష్ట్రాలు, పలు సంస్థలు, వ్యక్తులు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. చిన్నారులు సయితం సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తనకున్నటువంటి మూడు వ్యక్తిగత సేవింగ్స్ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. తమ ఖాతాలో ఉన్న రూ. 51 లక్షల మొత్తాన్ని శుక్రవారం ఆయన సతీమణితో కలిసి ప్రభుత్వ కార్యదర్శికి అందజేశారు.