విజయవాడ వరద బాధిత ప్రాంతాలలో పర్యటించిన సిఎం

విజయవాడ (CLiC2NEWS): నగరంలో ఇలాంటి విపత్తును ఎన్నడూ చూడలేదని సిఎం చంద్రబాబు అన్నారు. భద్రతా సిబ్బంది వద్దని వారించినా వినకుండా సిఎం బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశానని, వరదనీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తానని సిఎం తెలిపారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు.