రేపటి నుండి పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అక్టోబర్ 6 నుండి సిఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని.. ముఖ్యమంత్రి కెసిఆర్ అల్పాహార పథకాన్ని ప్రకటించారు. సిఎం కెసిఆర్ శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం రావిర్యా జడ్‌పిహెచ్ ఎస్‌లో ఈ పథకాన్ని ఉదయం 8.45 గంటలకు ప్రారంభించనున్నారు. మొదట ఈ పథకాన్ని దసరా కానుకగా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం పాఠశాల ప్రారంభం కావడానికి ముందే అల్పాహారం విద్యార్థులకు అందించనున్నారు. దీనికి కోసం ప్రత్యేక మెనూ ఏర్పాటు చేశారు.
ఆరు రోజుల బ్రేక్‌ఫాస్ట్ మెనూ..
సోమవారం.. ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం.. పూరి, అలుకుర్మ లేదా టమాటాబాత్ ,చట్నీ
బుధవారం .. ఉప్మా సాంబార్ లేదా కిచిడి, చట్నీ
గురువారం.. మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం.. ఉగ్గాని/ పోహా/ మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడి, చట్నీ
శనివారం.. పొంగల్/ సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ అలుకుర్మా