అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్

హనుమకొండ (CLiC2NEWS): జిల్లాలోని గుండ్ల సింగారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఇంద్రా కాలనీలో స్వయానా ఓ అత్తగారిని సొంత అల్లుడు కాల్చి చంపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు. 25 సంవత్సరాల కిందట గుండ్ల సింగారంలోని ఇంద్రాకాలనీ కి చెందిన రమాదేవికి, వరంగంల్ జిల్లా కీర్తి నగర్ చెందిన అడ్డె ప్రసాద్‌తో వివాహం జరిగింది. పెద్దపెల్లి జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రసాద్.. తుపాకిని తీసుకుని గుండ్ల సింగారంలోని అత్తగారి ఇంటికి వచ్చాడు ఇవాళ. అత్త కమలమ్మ (53)కు అల్లుడు ప్రసాద్‌కు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. చిన్నగొడవతో కోపోద్రిక్తుడైన ప్రసాద్ తన వద్ద ఉన్న తుపాకీతో కమలమ్మను కాల్చి చంపాడు. తుపాకి శబ్బం విన్న చుట్టుపక్కల వారు.. కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.