ఆ ఇంజ‌క్ష‌న్ ఖ‌రీదు రూ. 16 కోట్లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 23నెల‌ల చిన్నారి ఆరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతోంది. ఆమె చికిత్స‌కు రూ.16 కోట్లు విలువైన ఇంజ‌క్ష‌న్ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెప్పారు. దీంతో ఆ చిన్నారి త‌ల్లి దండ్రులు ఉచితంగా అందించే ఆ ఇంజ‌క్ష‌న్ గురించి తెలుసుకున్నారు. రూ. 16 కోట్ల విలువ చేసే ఆ ఇంజ‌క్ష‌న్‌ను స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన నోవార్టిస్ కంపెనీ సామాజిక కార్య‌క్ర‌మాల్లో భాగంగా నెల‌కో దేశానికి ఉచితంగా అందిస్తుంది. ఈ విష‌యం తెలుసుకొని సంస్థ వ‌ద్ద రిజిస్ట‌ర్ చేయించుకున్నారు. ఇంజ‌క్ష‌న్ రావ‌డంతో వైద్యులు ఆచిన్నారికి ఇంజ‌క్ష‌న్ వేశారు. పాప ఆరోగ్యం మెరుగ‌వుతుంద‌ని త‌ల్లి దండ్రులు ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.