ప్రియుడితో కలిసి పారిపోవడానికి స్కెచ్..

ఛండీఘర్ (CLiC2NEWS): ప్రియుడితో పారిపోయేందుకు ఓ యువతి తన లాగే ఉన్న మరో అమ్మాయి ప్రాణం తీసింది. ఓ టివి సీరియల్ ఆధారంగా స్కెచ్ వేసి.. తను చనిపోయినట్లు నమ్మించడానికి తన లాగే ఉండే మరో యువతిని హతమార్చారు. ఈ ఘటన హరియాణా రాష్ట్రంలోని పానీపత్‌లో జరిగింది. జ్యోతి, కృష్ణ ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. వీరి వివాహానికి జ్యోతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో.. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందకు.. జ్యోతిలాగే ఉండే తన స్నాహితురాలైన సిమ్రన్ను గొంతుకోసి హతమార్చారు. ఈ ఘటన 2017లో జరగగా .. ఇప్పుడు నిందుతులకు శిక్ష పడినట్లు సమాచారం.
2017లో జ్యోతి తన స్నేహితురాలైన సిమ్రన్నుకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి గొంతుకోసి హతమార్చింది. సిమ్రన్ దుస్తులు మార్చి, ఆ స్థలంతో జ్యోతికి సంబంధించిన కొన్ని వస్తువులు పడేసి ప్రేమికులిద్దరూ పారిపోయారు. చనిపోయిన సిమ్రన్ మృతదేహం జ్యోతిదే అనుకున్న తల్లిదండ్రులు దహన సంస్కారాలు చేశారు. అయితే.. సిమ్రన్ కనిపించటం లేదని ఆమె తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణ కోర్టు విచారణ సమయంలో ఆనారోగ్యంతో జైలులోనే మరణించాడు. జ్యోతికి కోర్టు జీవితఖైదు విధించింది.