పాన్‌, ఆధార్ అనుసంధానం గ‌డువు మే 31

ముంబ‌యి (CLiC2NEWS): పాన్ కార్డు ఉన్న ప్ర‌తి వ్య‌క్తి ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం 1961 ప్ర‌కారం త‌న ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన గ‌డువు మ‌గిసింది. ఇప్ప‌టికీ చేయ‌ని వారు వెయ్యి రూపాయ‌ల అప‌రాధ రుసుంతో పాన్ + ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మార్చి 31, 2024 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంద‌ని తాజాగా ఆదాయ ప‌న్ను విభాగం ప‌న్ను చెల్లింపు దారుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. అలా చేయ‌ని ప‌క్షంలో 2024 మార్చి 31 ముందు చేసిన లావాదేవీల‌పై అధిక రేటు వ‌ద్ద ప‌న్ను కోత /చెల్లింపులు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

పాన్‌- ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే విధానం

ఆధార్‌తో పాన్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకోడానికి.. ఆదాయ ప‌న్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి త‌నిఖీ చేసుకోవ‌చ్చు. ఇన్‌కామ్ టాక్స్ వెబ్‌సైట్‌లో `లింక్ ఆధార్ స్టేట‌స్‌` పై క్లిక్ చేసి తెలుసుకోవ‌చ్చు. ఇదివ‌ర‌కే అనుసంధానం అయి ఉంటే.. లింక్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది. లేని ప‌క్షంలో ఫైన్ చెల్లించి ఆధార్‌- పాన్ అనుసంధానం పూర్తి చేయాలి.

Leave A Reply

Your email address will not be published.