అగ్నిప‌థ్: రెండేళ్ల సుదీర్ఘ అధ్య‌య‌నం త‌ర్వాతే నిర్ణ‌యం

అగ్నిప‌థ్‌పై త్రివిధ ద‌ళాల ప్ర‌క‌ట‌న‌

ఢిల్లీ (CLiC2NEWS): సైన్యంలో స‌గ‌టు వ‌య‌సు తగ్గించేందుకే సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్నామ‌ని త్రివిధ ద‌ళాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. అగ్నిప‌థ్‌పై రెండేళ్లుగా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దీనికోసం ఇత‌ర దేశాల సైన్యాల‌పైనా త్రివిధ ద‌ళాధిప‌తులు స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేశార‌న్నారు. సాయుధ ద‌ళాల నియామ‌కాల కోసం కొత్త‌గా తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో వాటిపై అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు త్రివిధ ద‌ళాల‌కు చెందిన అధికారులు నేడు మీడియాతో మాట్లాడారు.

ప్ర‌స్తుతం సాయుధ ద‌ళాల్లో ఉన్న‌వారి స‌గ‌టు వ‌య‌సు 30 ఏళ్ల‌కు పైగా ఉంది. ఇలా కొన‌సాగ‌డం ఆందోళ‌న‌క‌ర విష‌యం. యువ సైనికులు అయితే సైన్యంలో టెక్నాల‌జీని స‌మ‌ర్థంగా వినియోగిస్తార‌ని భావించాం. సెల్‌ఫోన్లు, డ్రోన్‌ల‌తో యువ‌కులు అద్భుతాలు చేస్తున్నార‌ని అన్నారు. అందుకే యువ‌త సైన్యంలోకి రావ‌టానికి, వెళ్లిపోవ‌డానికి అవ‌కాశాలు పెంచామ‌న్నారు. ఈ క్ర‌మంలో అనుభ‌వం ఉన్న‌వారికి, యువ‌శ‌క్తికి స‌మాన ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్నామని సైనిక వ్య‌వ‌హారాల విభాగంలో అడిషిన‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న లెప్టినెంట్ జ‌న‌ర‌ల్ అనిల్ పూరీ పేర్కొన్నారు. ఈ నెల 24 వ తేదీ నుండి అగ్నిప‌థ్ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించానున్నారు. జులై 24వ తేదీన అగ్నిప‌థ్ ఫేజ్‌-1 ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఈ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ చివ‌రి నాటికి అగ్నివీరుల‌కు శిక్ష‌ణ ప్రారంభిస్తారు.

Leave A Reply

Your email address will not be published.