మిలిటరీ విమానంలో భారత్‌కు వలస దారులు..
అగ్రరాజ్యంలో అక్రమ వలసదారుల గుర్తింపు, తరలింపు ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించడం జరుగుతుంది. వలసదారులను గుర్తించి, ఆయా దేశాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన వారిని సైతం ప్రత్యేక మిలిటరీ విమానంలో పంపిస్తున్నట్లు సమాచారం. సి17 ఎయిర్‌క్రాప్ట్ లో వీరిని భారత్‌కు తరలిస్తున్నట్లు ప్రముఖ వార్త ఏజెన్సి పేర్కొంది.
అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధ్యక్ష పీఠం అధిరోహించిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అ దిశలో వాటికి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేశారు. అక్రమంగా వలస వచ్చిన వారంతా ఆయా దేశాలకు తిరిగి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం సైతం చర్యల్ని వేగవంతం చేసింది. అమెరికాలో భారత్‌కు చెందిన వలసదారులు 7 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది వీసా గడువు పూర్తయినా అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరిలో 18 వేల మందిని భారత్‌కు తరలించేందుకు అగ్రరాజ్యం జాబితాను రూపొందించింది. మొదటి బ్యాచ్‌గా 205 మంది భారతీయులతో మంగళవారం టెక్సాస్లో బయల్దేరిన విమానం పంజాబ్లోని అమృత్‌సర్ చేరుకోనున్నట్లు సమాచారం.
మేం ఎప్పుడూ చట్టబద్దమైన వలసలకే మద్దతు పలుకుతామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై. జయశంకర్ తెలిపారు. అక్రమ వలసల్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని, అయన ఇటీవల వాషింగ్టన్ లో వ్యాఖ్యానించారు. సరైన పత్రాలు లేకుండా ఇతర దేవాలకు వలస వెల్లి స్వాదేశానికి తిరిగి రావానలనుకునే భారతీయులకు తిరిగి స్వీకరించేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.
అక్రమంగా ఉంటున్నవారు ఆయా దేశాలకు వెళ్లిపోవాల్సిందేనని ట్రంప్ ఇదివరకే స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేనివారిని లేదా అక్రమ వలస దారుల్ని వారి స్వదేశాలకు పంపేందుకు వాణిజ్య, సైనిక విమానాలను వినియోగిస్తుంది.
ముందుగా 538 అక్రమ వలసదారులను గుర్తించి, ఆయా దేవౄలకు తరలించారు. అనంతరం ఎల్ పాసో, టెక్సాస్ , శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5 వేల మందిని ఆయా దేశాలకు పంపించేందుకు పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటి వరక గటేమాల, పెరు, హోండూరస్ తదితర దేశౄలకు వలస దారులను యుఎస్ విమానాల్లో తరలించినట్లు సమాచారం. ఈ వలసదారులను పంపించేందుకు అమెరికా భారీగా ఖర్చుపెండుతున్నట్లు తెలుస్తోంది.