AP: డిప్యూటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా

అమరావతి (CLiC2NEWS): అంధ్రప్రదేశ్లో డిప్యూటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షను ఎపిపిఎస్సి వాయిదా వేసింది. 38 ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 13న పరీక్ష జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలు, డిఎస్సి పరీక్షలు ఉన్నందున.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు సమాచారం. ఈ పరీక్షను మే 25న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిప్యూటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్ష కోసం జనవరి నెలలో దరఖాస్తులు స్వీకరించారు.