భూకంపం సృష్టించిన విలయం.. 35వేలకు పైగా మృతులు

అంకారా (CLiC2NEWS): తుర్కియే, సిరియాలో భూకంపం సంభవించి వారం గడుస్తోంది. మృతులు సంఖ్య 35వేలకుపై మాటే. ఇంకా తమవారి కోసం ఎదురుచూసేవారికి కన్నీరే మిగులుతోంది.భారీ సంఖ్యలో మృతదేహాలను ఒకే చోట ఖననం చేస్తున్నారు. శ్మశాన వాటికలకోసం ఫైన్ అడవులను కొట్టివేసి.. సమాధులను తవ్వేందుకు పొక్లెయిన్లు, బుల్డోజర్లు ఉపయోగిస్తున్నారు. సుమారు 5వేల మృతదేహాలను ఒకే ప్రాంతంలో సమాధిచేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం మరోసారి భూమికంపించింది. ఇది రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైనట్లు సమాచారం.