విమానం గాల్లో ఉండగానే తెరుచుకున్న డోర్..
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/ASIYANA-AIR-LINES.jpg)
సియోల్ (CLiC2NEWS): విమానం గాల్లో ఉండగానే ద్వారం తెరుచుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. కానీ విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన దక్షిణ కొరియాలోని జెజూ ద్వీపం నుండి బయలుదేరిన ఏసియానా ఎయిర్‌లైన్స్ విమానం 321లో జరిగింది. విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు అడ్డుకున్నా గానీ, ద్వారం అప్పటికే తెరుచుకుంది. దీంతో భారీగా గాలి లోపలికిరావడంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు.