అహం అదే ఇగో

అహం, అహంకారం, అహంభావం

ఆంగ్లంలో అదే ఇగో, పేరు ఏదైతేనేం

కరోనా కంటే ప్రమాదకరం

వైషమ్యాలు, పోరాటాలు, ఎత్తులు, పైఎత్తులు

ఆత్మీయత, అనురాగం, అనుబంధాలను

కాటేస్తున్నాయి, అహం అదే ఇగో

 

మానవ సంంధాలను మంటగులుపుతున్నది

కరోనా లాగా అంటు రోగం కాకపోయినా

కోవిడ్ కష్టాలు రెండేళ్ల నుంచే

ఎప్పుడని లెక్కిద్దాం అహంకార వయస్సు,

 

భార్యాభర్తలు విద్యావంతులైతే…

ఎవరు ఎక్కువ, తక్కువ కయ్యాల కథలెన్నో

కోడలు పెత్తనం పెరుగుతుందనే అత్తల దాష్టీకాలు

అత్తమామల పట్ల కోడళ్ల వైపరీత్యాలు

అన్నదమ్ముల మధ్యనే కాదు స్నేహితుల మధ్య

చేరుతున్నది, చెప్పుడు మాటలతో ఇదే విషం

ఈర్ష్యా ద్వేషాలే కారణాలు కష్టనష్టాలకు

ఇగో విషాధాంతాలు ఈనాటివి కావేమో

సత్యభామ ఇగో తగ్గింది రుక్మిణి తులసి రెమ్మతో

జరాసంధుని అంతంతోనే ముగిసింది అహం

తొడలు విరిగితేకానీ చావలేదు సుయోధనుని ఇగో

సమరాలు సాగాయి, రాజులు ఒరిగారు అదే ఇగోతో

అగ్ర రాజ్యాల మధ్య రాజుకుంటున్నది ఇగో సమరం

కుటుంబం నుంచి దేశాధినేతల వరకు

కరోనా మహమ్మారిలా ఇగో విశ్వవ్యాప్తం

 

అంతరంగంలో సాగాలి యుద్ధాలు

అహంభావంతో పోరాడాలి మనస్సులు

మంచి ఏదో తెలుసుకునే ఇంగితం పెరగాలి

కలసి ఉంటే కలదు సుఖం… భావన

కోరుకుంటున్నది, ఆరాటపడుతున్న మనస్సు

-కోనేటి రంగయ్య
సీనియ‌ర్ పాత్రికేయులు

Leave A Reply

Your email address will not be published.