మద్యం మత్తులో తమ్ముడిని చంపిన అన్న

మహబూబాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని దంతాలపల్లి మండలంలోని రేపోనిలో మద్యం మత్తులో తమ్ముడిని చంపాడు ఓ అన్న. రేపోనికి చెందిన వెంకన్న, గంగయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. గురువారం రాత్రి ఇద్దరు కలిసి మందు తాగుతుండగా ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దగా మారింది. దీంతో మద్యంమత్తులో ఉన్న వెంకన్న ఆవేశంతో చేతికందిన గొడ్డలితో గంగయ్యని నరికాడు. దాంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.