నేటి నుండి ప‌ద‌కొండ‌వ విడ‌త రైతుబంధు ప్రారంభం..

హైద‌రాబాద్ (CLiC2NEWS):  రాష్ట్రంలో రైతు బంధు పండుగ మొద‌లైంది. నేటి నుండి రైతుల ఖాతాల్లోకి నిధులు జ‌మ చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హారీశ్ రావు ట్విట‌ర్ వేదిక‌గా తెలిపారు. ప‌ద‌కొండ‌వ విడ‌త రైతుబంధు జూన్ 26 నుండి ప్రారంభ‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు రూ. 645.52 కోట్ల నిధుల‌ను రైతుల ఖాతాల్లో జ‌మ చేసిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ఈ ఒక్క రోజులో సుమారు 22,55,081 మంది రైతుల‌కు రైతు బంధు అందిన‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.