జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబసభ్యులు..

పుణె (CLiC2NEWS): జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం మిగిలింది. ఆదివారం కుటుంబమంతా విహారయాత్రకు వెళ్లిన జలపాతం ప్రావాహంలో కొట్టుకుపోయారు. వారిలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో బాలిక, బాలుడి ఆచూకీ లభించలేదు. మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్‌వాటర్ సమీపంలోని జలపాతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హడప్సర్ ప్రాంతానికి చెందిన అన్సారీ కుటుంబం విహరయాత్రకోసం భూసీ డ్యామ్ కు వచ్చారు. అనంతరం జలపాతంలోకి వెళ్లారు. జలపాతం ఉదృతి క్రమంగా పెరిగిపోతుంది. అది గమనించలేక పోవడంతో జలపాతంలో కొట్టుకుపోయారు.