ఇద్దరి పిల్లలతో సహా తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య
The father committed suicide with his two children

సిద్దిపేట (CLiC2NEWS): ఓ తండ్రి తన ఇద్దరి పిల్లలను తీసుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట లోని వివేకానందనగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. వివేకానందనగర్‌లో నివాసముంటున్న సత్యం ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు . పిల్లలిద్దరితో సహా సత్యం చెరువులోకీ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో తన సోదరుడికి రూ.4లక్షలు అప్పు ఇచ్చాడని.. అవి తిరిగి ఇవ్వకపోగా అవమానించినట్లు పోలీసులకు వెల్లడించింది.