శెభాష్ రాజేశ్వరి.. ఓ వ్యక్తిని భూజాలపై మోసి కాపాడిన మహిళా ఇన్స్‌పెక్టర్

చెన్నై (CLiC2NEWS): తమిళనాడు రాజధాని చెన్నైలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై అతలాకుతలం అవుతోంది. పోలీసులు, అగ్నిమాపక, ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం చెన్నైలోని టి పి సత్రం ప్రాంతంలో మహిళా పోలీసు ఇన్స్‌పెక్టర్ రాజేశ్వరి ఓ వ్యక్తిని కాపాడిన తీరు ఇంటర్‌నెట్లో వైరల్‌గా మారింది. అనారోగ్యంతో శ్మశాన వాటికలో అపస్మారక స్థితిలో ఉన్న 28 ఏళ్ల యువకుడిని మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ రాజేశ్వరి భుజాలపై మోసుకెళ్ళి ఆసుపత్రికి తరలించారు. తొలుత కారులోకి ఎక్కించేందుకు యత్నించగా అది సాధ్యం కాలేదు. అటుగా ఎదురుగా వస్తున్న ఆటో దగ్గరకు తీసుకెళ్లి ఆటో ఎక్కించారు.
దాంతో ఓ మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ చేసిన సేవ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె చేసిన సేవకు సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి.
“శెభాష్ రాజేశ్వరి“ “సెల్యూట్ మేడం“ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక గత శనివారం నుంచి కురిసిన భారీ వర్షాలకు తమిళనాడులో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రకటించింది.
View this post on Instagram