ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించింది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి నవంబరు 27వ తేదీన ఐర్లాండ్ నుంచి ముంబై మీదుగా వైజాగ్ వచ్చాడు. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయంలో కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అనంతరం నమూనాలను హైదరాబాద్ సిసిఎంబికి పంపగా ఒమిక్రాన్‌గా తేలినట్లు వైద్యరోగ్యశాఖ తెలిపింది.