ఉక్రెయిన్‌లోని మేరియుపోల్ నుండి బయలుదేరిన తొలినౌక
మేరియుపోల్ (CLiC2NEWS): రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని మేరియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసినదే. అనంతరం రష్యా మేరియుపోల్ నౌకాశ్రయాన్ని పునరుద్ధరించే పని ప్రారంభించింది. తాజాగా అక్కడి నౌకాశ్రయం నుండి ఒక నౌక బయల్దేరినట్లు సమాచారం. రష్యా అనుకూల వేర్పాటువాద నేత ఒకరు ధ్రువీకరించారు. మేరియుపోల్ నుండి 2,500 టన్నుల షీట్ మెటల్ లోడ్‌తో ఓ నౌక రోస్టోవ్‌కు బయల్దేరింది.
ఉక్రెయిన్‌లో ఒడెస్సా తర్వాత మేరియుపోల్ రెండో అతిపెద్ద పోర్టు. రష్యా ఈ పోర్టును స్వాధీనం చేసుకొన్నాక గత వారం తిరిగి తెరిచింది. శీతాకాలం సహా అన్ని సీజన్లో వివిధ రకాల కార్గోను తరలించవచ్చని క్రెమ్లిన్ అనుకూల నేత పేర్కొన్నారు.
మేరియుపోల్‌లో ఆహార ధాన్యాలు, ఖనిజాలను అపహరిస్తున్నారని ఉక్రెయిన్ మానవ హక్కులు నాయకులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారులు తాత్కాలికంగా స్వాధీనం చేసుకొన్న ప్రాంతాలను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.