Vande Mataram: జాతి జ్వాల, సంస్కృతి గీతం!

వందే మాతరం…
అది కేవలం రెండు పదాలు కావు, భారత మాత నుదుటి తిలకం,భూమి మట్టి వాసనలో నిండిన మంత్రం, జాతి రక్తనాళాల్లో ప్రవహించే గీతం.

1875లో బంకిమ్ చంద్ర చటర్జీ కలం ఆనందమఠం పుటల్లో ఈ గీతాన్ని రాసినపుడు, ఆ అక్షరాలు అగ్నిజ్వాలగా మారాయి.

“సుజలాం సుఫలాం మలయజశీతలం”.. ఆ పాదాల ప్రతి అణువు ప్రకృతికి పూజ, మాతృభూమికి వందనం. ఆ గీతం వినగానే వృక్షాలు సలాంచేశాయి, నదులు నర్తించాయి, గాలులు జాతీయ స్వరం మోగించాయి. దేశం అప్పటినుండి మేల్కొంది .

బానిస సంకెళ్లు తెంచుకొని
ఒక కొత్త గీతం జన హృదయాల్లోకొలువై నిలిచింది
వందే మాతరం

ఓ మాతా, నీ పేరే మాకు దీపం,
నీ చరణాలే మాకు దారిదీపం.
స్వాతంత్య్ర‌ యోధుల రక్తంలో నీవు నడిచావు,
లాఠీ దెబ్బల నడుమ, కారాగార గోడల వెనుక
నీ గీతం రాగ,తాళాల జ్ఞాపకమైంది.
ప్రతి పాఠశాల ప్రభాత వేళలో మ్రోగే నీ గానం
మన సంస్కృతికి శిరోమణి గుర్తుగా నిలిచింది
ఈ దేశం మన ఇల్లు మాత్రమే కాదు, మన ఆత్మ నివాసం.

150 ఏళ్లు గడిచినా,
నీ స్వరంలో నేటికీ గర్వం గర్జిస్తోంది.
నువ్వు పాత గీతం కాదు…
ప్రతి తరంలో పుట్టే కొత్త ప్రతిజ్ఞ.
ప్రతి యువ హృదయంలో మేల్కొనే దేశప్రేమ.
మాతృభక్తి, దేశభక్తి, సంస్కృతిభక్తి..
ఈ మూడింటి సమ్మేళన గానమే వందే మాతరం

“భారతమాతను స్తుతించడం అంటే మన మనసుని శుభ్రపరచుకోవడం,
మన జీవనాన్ని అర్థవంతం చేసుకోవడం.”

జై భారత్.. జైజై భారత్

మేరా భారత్ మహాన్

 

-ఎస్.వి.రమణా చార్య
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు
సెల్‌: +91 98498 87086

Also Read: Vande Mataram: జాతి జ్వాల, సంస్కృతి గీతం

1 Comment
  1. […] Vande Mataram: జాతి జ్వాల, సంస్కృతి గీతం! […]

Leave A Reply

Your email address will not be published.