మార్చి 31తో ముగియనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ గడువు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు తేదీ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీపం 2.O పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్‌లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద తొలి గ్యాస్ సిలిండర్ డిసెంబర్- మార్చి మధ్యలో బుక్ చేసుకోవాల్సి ఉంది. అయితే మార్చి 31తో గడువు ముగియనుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టు కుందని .. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్‌లను వినియోగించుకున్నారని తెలిపారు.