హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్ర‌భుత్వ‌ ల‌క్ష్యం: మంత్రి తలసాని

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే తెలంగాణ స‌ర్కార్ ప్రధాన లక్ష్యమ‌ని సినిమాటోగ్ర‌ఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బీఆర్‌కేఆర్ భవన్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి త‌ల‌సాని అధ్యక్షతన మంగ‌ళ‌వారం స‌మీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా నష్టపోయిన సినీ రంగాన్ని ఆదుకునేందుకు 5వ షో ప్రద‌ర్శన‌కు అనుమ‌తివ్వాలని ఎగ్జిబిటర్లు మంత్రిని కోరారు. దీంతో 5వ షోకు అనుమతిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

క‌రోనా లాక్ డౌన్ సమయంలో థియేటర్‌లు మూసివేసి ఉన్న కార‌ణంగా విద్యుత్ చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు తదితర విజ్ఞప్తుల‌ను ప్రభుత్వానికి అందజేసిన‌ట్లు తెలిపారు. సిఎం కెసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లి వచ్చే సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తెలిపారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంద‌న్నారు.

1 Comment
  1. Earn Online says

    Wow, superb blog layout! How long have you been blogging for? you made running a blog look easy. The whole glance of your web site is great, as smartly as the content!!

Leave A Reply

Your email address will not be published.