రైతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైతన్నలకు ముఖ్యమంత్రి శుభవార్తనందించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా సొమ్ము జమ చేస్తామన్నారు. రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. నగరంలోని సిఎం నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మారీచుల మాయమాటల నమ్మోద్దని, సోనియాగాంధీ గ్యారంటీగా నేను చెబుతున్నానని రైతులకు విజ్ఞప్తి చేశారు. రూ. 2లక్షల రుణమాఫీ ఏవిధంగా అయితే పూర్తి చేశామో .. అదేవిధంగా రైతు భరోసా కూడా అమలు చేస్తామని సిఎం స్పష్టం చేశారు. రైతు భరోసాపై డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినేట్ సబ్ కమిటి వేశారని.. అసెంబ్లీలో చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని సిఎం తెలిపారు.