పంచాయితీ కార్యదర్శులకు గుడ్‌న్యూస్ తెలిపిన సర్కార్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని పంచాయితీ కార్యదర్శులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తెలిపింది. నాలుగు సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న ఉద్యోగులను, నిర్దేశించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరశీలించి.. క్రమబద్దీకరించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సిఎం కెసిఆర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామాల్లో జరుగుతున్నీఅభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా వారు నిరంతర కృషి కొనసాగుతూ వుండాలని సిఎం ఆకాంక్షించారు.