మ‌ణిపుర్‌లో ఘ‌ర్ష‌ణ‌లు.. తెలంగాణ విద్యార్థుల‌ను తీసుకురావాల‌ని ప్ర‌భుత్వ నిర్ణ‌యం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఈశాన్య రాష్ట్రం మ‌ణిపుర్ హింసాత్మ‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉన్న తెలంగాణ విద్యార్థుల‌ను ప్ర‌త్యేక విమానంలో త‌ర‌లించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రేపు మ‌ధ్యాహ్నం ఇంఫాల్ నుండి ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసింది. తెలంగాణ‌కు చెందిన 250 మంది విద్యార్థులు ఇంఫాల్‌, స‌మీప ప్రాంతాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌ణిపుర్‌లో నెల‌కొన్న పరిస్థితులను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూ అక్క‌డున్న రాష్ట్ర వాసుల కోసం ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేసింది.

మ‌ణిపుర్‌లో మెజార్టి మైతై కమ్యూనిటిని షెడ్యూల్ తెగ లో చేర్చే చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూ.. గిరిజ‌న సంఘాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. షెడ్యూల్ తెగ స్టేట‌స్ కోసం గిరిజ‌నేత‌ర మైతై వ‌ర్గం డిమాండ్‌కు వ్య‌తిరేకంగా ఆల్ ట్రైబ‌ల్ స్గూడెంట్ యూనియ‌న్ మ‌ణిపుర్ గిరిజ‌న సంఘీభావ యాత్ర‌కు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొన్న‌ట్లు స‌మాచారం. ఎస్‌టి హోదా కోసం మైతై చేసిన డిమాండ్‌కు వ్యాలీ ప్రాంతానికి చెందిన చ‌ట్ట‌స‌భ్యుల నుండి మ‌ద్ధ‌తు ల‌భించింది. దీంతో గిరిజ‌నుల‌కు.. గిరిజ‌నేత‌రుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ఇది హింసాత్మ‌కంగా మారింది. నిర‌స‌న‌కారులు ప్రార్ధ‌నా స్థ‌లాలు, వాహ‌నాల‌ను త‌గ‌ల‌బెట్టారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్ బ‌ల‌గాల‌ను రంగంలోకి దిగారు. మ‌ణిపుర్‌లో ఉన్న‌టువంటి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను హైద‌రాబాద్ తర‌లించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి మ‌ణిపుర్ సిఎస్‌తో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థుల‌ను క్షేమంగా వ‌చ్చేలా చూడాలిన కోరారు.

ఇటీవ‌ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి బీరేన్ సింగ్ పాల్గినాల్సిన స‌భావేదిక‌కు నిప్పంటించిన విష‌యం తెలిసిన‌దే.

మ‌ణిపుర్‌లో ముఖ్య‌మంత్రి స‌భావేదిక‌కు మంట‌లు..

Leave A Reply

Your email address will not be published.