నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది… మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పుల (CLiC2NEWS): ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రైతన్నలు విపరీతంగా నష్టపోతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా నీటమునిగిపోయింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. దేవరుప్పల మండలం, సీతారాంపురం గ్రామంలో తడిసిన ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. గ్రామంలోని రేణుక ఎల్లమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని రైతులతో మాట్లాడారు. అకాల వర్షాలకు ధాన్యం తడవడంవల్ల రైతులు నష్టపోయారని.. ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లోతట్టు ప్రాంతంలో పెట్టడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, గోదాములకు తరలించాలని సూచించారు.