నంది అవార్డులకు గద్దర్పేరు పెట్టాలన్న నిర్ణయం సముచితమే.. చిరంజీవి

హైదరాబాద్ (CLiC2NEWS): పద్మ అవార్డులకు ఎంపికైన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. నగరంలోని శిల్పకళా వేదికలో ప్రముఖ నటుడు చిరంజీవి, మాజి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వారితోపాటు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యలను సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన తర్వాత వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే చాలా ఆనందంగా ఉందని, ఈ జన్మకిది చాలనిపిస్తోందని చిరంజీవి అన్నారు. మా అమ్మానాన్నల పుణ్యఫలం నాకు సంక్రమించిందన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
కళాకారులకు అవార్డులు ఇస్తే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని చిరంజీవి అన్నారు. నంది అవార్డులకు ప్రజాగాయకుడు గద్దర్ పేరు పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సముచితమైనదేనని ఈ సందర్బంగా తెలియజేశారు. నంది అవార్డులు గత చిరత్రలా అయిపోయాయని, వాటిని త్వరలో ఇస్తామని సిఎం ప్రకటించడం ఆనందకరమన్నారు.