విఆర్ఎల స‌ర్దుబాటు ప్ర‌క్రియ నిలిపివేసిన‌ ఉన్న‌త న్యాయ‌స్థానం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని విఆర్ ఎల‌కు పే స్కేల్ అమ‌లు చేస్తూ ఇత‌ర శాఖ‌ల్లోకి స‌ర్దుబాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే చ‌ట్టాలు, సర్వీసు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా స‌ర్దుబాటు ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని, త‌మను రెవెన్యూ శాక‌లోనే కొన‌సాగించాల‌ని ప‌లువురు విఆర్ ఎలు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై హైకోర్టులో గురువారం విచార‌ణ జ‌రిగింది. విఆర్ ఎల స‌ర్దుబాటు చేస్తూ ప్ర‌భుత్వం ఇచ్చిన ఉత్త‌ర్వులను ఉన్న‌త న్యాయ‌స్థానం స‌స్పెండ్ చేసింది. జులై 24న జిఒకు ముందున్న స్థితినే య‌థాత‌థంగా కొన‌సాగించాల‌ని హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది.

విఆర్ ఎలను ఇత‌ర శాఖ‌ల్లో స‌ర్దుబాటు .. దీనికి అనుగుణంగా రెవెన్యూ శాఖ జులై 24వ తేదీన జిఒ 81, ఆర్ధిక శాఖ ఆగ‌స్టు 3న జిఒ 85 జారీ చేశాయి. సిసిఎల్ ఎ జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌కారం రాష్ట్ర వ్యాప్తంగా 61 ఏళ్ల లోపు వ‌య‌సున్న 16,758 మంది విఆర్ ఎల‌ను వారి వారి విద్యార్హ‌త‌ల‌కు అనుగుణంగా వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో లోయ‌ర్ గ్ర‌డ్ స‌ర్వీస్‌, రికార్డు అసిస్టెంట్‌, జూనియార్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింద‌. ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌సు దాటిన మ‌రో 3,797 మంది వార‌సుల‌కు కారుణ్య నియామ‌కాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ప‌లువురు విఆర్ ఎలు స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా స‌ర్దుబాటు జ‌రుగుతుంద‌ని హైకోర్టు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.