‘ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలి’: కెసిఆర్

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నించాలన్నారు. కెసిఆర్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. సోమవారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సిఎం దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలి. కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలని తెలిపారు. కృష్ణా జలాల వాటా కోసం పట్టు బట్టాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేశవ రావు, లోక్ సభ, రాజ్య సభ సభ్యులు పాల్గొన్నారు.