విజయవాడలో విరిగిపడిన కొండచరియలు..
బాలిక మృతి! పలువురికి తీవ్రగాయాలు

విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు విజయవాడలోని మొగల్రాజపురం సున్నపు బట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక బాలిక మృతి చెందినట్టు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. మరి కొన్ని ఇళ్లు పాక్షింగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.