అఫ్ఘన్ ను వీడిన అమెరికా చివరి విమానం..
వాషింగ్టన్ (CLiC2NEWS): అమెరికా రక్షణ బలగాలతో కూడిన చివరి విమానం అప్ఘనిస్థాన్ నుంచి సోమవారం అర్థరాత్రి బయలు దేరింది. దీంతో అఫ్ఘన్ గడ్డనుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ బలగాలు పూర్తిగా వెనుదిరిగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ప్రకటించింది.
ఈ సందర్భంగా తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ విధించిన ఆగష్టు 31 గడువు తేదీలోపే అమెరికా దళాలు ఆఫ్ఘన్‌ను ఖాళీ చేశాయి. అయితే గత వారం రోజుల నుంచి కాబుల్‌లో చోటుచేసుకున్న బాంబు దాడుల నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఈ విమానం బయలుదేరింది.
యుఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ మెకంజీ పెంటగాన్‌లో ప్రకటిస్తూ…. “సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్ సీ-17 కాబుల్‌లోని హమీద్ కార్జారు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరింది. దీంతో ఆఫ్ఘన్లో సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయింది“ అని పేర్కొన్నారు.
Wow, awesome blog format! How lengthy have you ever been blogging for? you make running a blog glance easy. The whole glance of your site is fantastic, let alone the content!!