India Corona: దేశంలో తాజా కేసులు 21,566
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో తాజా కేసులు 21,566 నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్త కేసుల సంఖ్య 4,38,25,18కి చేరింది. వీటిలో 4,31,50,434 మంది బాధితులు కోలుకున్నారు. కాగా ఇప్పటి వరకు 5,25,870 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,48,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 45 మంది కరోనా బారిన పడి మృత్యువాత ప్డారు. అలాగే తాజాగా 18,294 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.