దేశంలో కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాల జాబితా..

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో పలు ప్రధాన నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. గాలి నాణ్యత తగ్గిపోవడం అందోళన కలిసిస్తున్న విషయం. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు బంద్ ప్రకటించిన విషయం తెలిసినదే. ఉద్యోగులో 50 శాతం మంది ఇంటి వద్దనుండే పని చేయాలని సూచించింది. ఈ క్రమంలో సిసిసిబి దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. మొత్తం 163 నగరాల గాలి నాణ్యత ప్రమాణాల వివరాలు ఇందులో ఉంచారు. వీటిలో బిహార్‌లోని కతిహర్ నగరం గాలి నాణ్యత (360 పాయింట్లు) పడిపోయి మొదటిస్థానంలో ఉన్నట్లు సిపిసిబి పేర్కొంది. రెండవ స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో గాలి నాణ్యత 354 పాయింట్లకు పడిపోయింది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో వాహనాలు విడుదల చేసే కర్భన ఉద్గారాల వలన కాలుష్యం పెరుగుతోందని సిపిసిబి తన నివేదికలో వెల్లడించింది. వీటి తరువాత బిహార్‌లోని బెగుసరాయ్, హరిణాలోని బల్లాబ్‌ఘర్, కైతాల్, గుడ్‌గావ్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్లు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు సైతం కాలుష్యంతో సతమవుతున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, ఏలూరు,తనంపురం నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో విశాఖ పట్టణం గాలి నాణ్యత 202 పాయింట్లకు పడిపోయింది. అనంతపురం (145 పాయింట్లు) , హైదరాబాద్ (100 పాయింట్లు), తిరుపతి (95 పాయింట్లు), ఏలూరు (61 పాయింట్లు) తరువాత స్థానాల్లో నిలిచినట్లు నివేదికలో పేర్కొన్నారు.
తప్పక చదవండి: ఢిల్లీ కాలుష్యం.. ప్రభుత్వం కీలక నిర్ణయం