Asifabad: రెబ్బ‌న వ‌ద్ద బైకును ఢీకొట్టిన లారీ.. తల్లీ కొడుకులు మృతి

రెబ్బ‌న (CLiC2NEWS): కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రెబ్బన వ‌ద్ద ఓ బైకును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు.

వివ‌రాల్లోకి వెళ్తే… మంచిర్యాల జిల్లా నుస్పూర్‌ నుంచి నలుగురు కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్‌కు మోటారు సైకిల్‌పై బ‌య‌లుదేరారు. ఈ క్రమంలో దారిలోని రెబ్బన వద్ద వారు ప్ర‌యాణిస్తున్న బైకును లారీ బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో తల్లీ కొడుకులు ఘ‌ట‌నాస్థ‌లంలో మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయాల‌పాల‌య్యారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుప‌త్రికి తరలించారు. పోలీసులు ఈ ప్ర‌మాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.