తుఫాన్‌గా మారిన అల్పపీడనం.. `హమూన్`గా నామకరణం
![](https://clic2news.com/wp-content/uploads/2023/10/Hamoon.jpg)
విశాఖపట్టణం (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. కాగా దీనితో పెద్దగా ప్రభావం ఉండదని అధికారులు పేర్కొన్నారు. ఇది దాదాపు 200 కి. మీ. దూరం నుండి తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ తుఫాన్‌కు `హమూన్`గా పేరు పెట్టారు. ఈ పేరును ఇరాన్ సూచించింది.
కాగా రానున్న 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఈ హమూన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఈ `హమూన్` 25 వ తేదీన బంగ్లాదేశ్‌లోని హెపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పెర్కొంది. తీర ప్రాంతాల జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. దీని ప్రభావం ఒడిశాపై పెద్దగా ఉండదని అయి.. జాలర్లు చేపల వేటకు వెళ్లరాని వాతావరణ శాటఖ హెచ్చిరించింది.