ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

హైదరాబాద్ (CLiC2NEWS): ఈ నెల 18న రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేయనున్నట్లు.. ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీ విషయంలో రేషన్‌కార్డు నిబంధనపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనపూ ఆయన స్పష్టత ఇచ్చారు. పాస్‌బుక్ ఆధారంగానే రూ. 2లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సిఎం ఆదేశాలు జారీ చేశారు.
పంటల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల: రాష్ట్ర ప్రభుత్వం