ముగ్గురిపై పెట్రోల్ పోసి హత్య.. నిందితుడికి మరణ శిక్ష
హైదరాబాద్ (CLiC2NEWS): 2022లో ముగ్గురిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి నాంపల్లి కోర్టు మరణశిక్ష విధించింది. నారాయణగూడకు చెందిన సాయిలు .. తన భార్య ఆర్తి , అతని ప్రియుడిని పెట్రోల్ పోసి హతమార్చాడు. ఈ ఘటనలో 10 నెలల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆర్తి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సుదీర్థ వాదనల అనంతరం శుక్రవారం నాంపల్లి కోర్టు సాయిలుకు మరణశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. అతనికి సహకరించిన స్నేహితుడు రాహుల్‌కి రూ.1000 జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.