జులై 1 నుండి అమలులోకి రానున్న నూతన నేర చట్టాలు
The new criminal laws: వచ్చేనెల 1వ తేదీ నుండి మూడు కొత్త నేర చట్టాలు అములోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలు అమలులోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత లోని 106 సబ్ సెక్షన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. ఐపిసి, సిఆర్‌పిసి , ఎవిడెన్స్ చట్టాల స్థానంలో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ రానున్నాయి.