ఈ నెల 17న నూతన సచివాలయం ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 17వ తేదీన ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో భారీ సభను నిర్వహించనున్నారు. రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గురువారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 17వ తేదీన నూతన సచివాలయం ప్రారంభం తర్వాత నిర్వహించే భారీ సభ నిర్వహణ కార్యక్రమాల గురించి వారికి దిశా నిర్దేశం చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభ విజయవంతం అయ్యేవిధంగా అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.