జయలలిత వేద నిలయాన్ని స్వాధీనం చేసుకున్న మేనకోడలు దీప

చెన్నై(CLiC2NEWS): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత నివాసాన్ని ఆమో మేనకోడలు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోయెస్ గార్డెన్‌ను అధికారులు దీపకు అప్పగించారు. జయలలిత మరణానంతరం ఆమె నివాసమైన వేద నిలయాన్ని అన్నాడిఎంకె ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ వేద నిలయాన్ని అన్నాడిఎంకె ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టును ఆశ్రయించారు. వేదనిలయాన్ని జయలలిత వారసులకు అప్పగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం నవంబర్ 24న తీర్పునిచ్చింది. జిల్లా కలెక్టర్ వేదనిలయం తాళాలను దీపకు అందజేశారు. వేద నిలయాన్ని చేరుకున్న దీప, దీపక్ పరిసరాలలోని ప్రజలకు అభివాదం చేశారు.