భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145కు చేరింది

ఢిల్లి (CLiC2NEWS): దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గుజరాత్లో తాజాగా రెండు కేసులు నిర్థారణయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసులు 145కు చేరాయి. బ్రిటన్ నుండి గుజరాత్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఈ వైరస్ సోకినట్లుగా గుర్తించారు. వారిని అహ్మదాబాద్ ఆస్పత్రికి తరలించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 48 కేసులు నమోదయ్యాయి. ఢిల్లిలో 22, తెలంగాణ రాష్ట్రంలో 20, రాజస్థాన్‌లో 17, కర్ణాటక లో 14, కేరళలో 11, గుజరాత్లో 9, ఆంధ్రప్రదేశ్, చంఢీగఢ్, తమిలనాడు, బెంగాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటికి 28మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.