కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేశ శోభాయాత్ర
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/ganesh.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరంలో గణేశ శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. నగరంలో హుస్సేన్ సాగర్ తో సహా దాదాపు 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గణేశుడి నామ స్మరణతో మార్మోగుతున్న హైదరాబాద్ నగర వీధులు..
ఖైరతాబాద్ మహాణపతి శోభాయాత్ర ఇవాళ (గురువారం) ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్‌సాగర్‌లో భారీ గణనాథుడు నిమజ్జనం పూర్తి కానుంది. ప్రస్తుతం ఖైరతాబాద్‌లోని రాజ్‌దూత్ హోటల్ వరకు చేరకున్న మహాగణపతి. కాగా నగరంలోని పాతబస్తీ, సికింద్రాబాద్‌నుంచి భారీగా తరలిస్తున్న వినాయకులు.
మరికాసేపట్లో బాలాపూర్ గణపతి లడ్డూ వేలం..
బాలాపూర్ లడ్డూ వేలంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బాలాపూర్‌లో గణపతి గ్రామ ఊరేగింపు అనంతరం అంటే.. దాదాపు 9.30 గంటల తర్వాత లడ్డూ వేలం నిర్వహించనున్నారు.
కాగా హైదరాబాద్‌లో నిమజ్జనం కోసం పోలీసు యంత్రాంగం దాదాపు 40 వేల మంది పోలీసులను మోహరించారు. ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. నగరంలో శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.