టేకాఫ్ అయిన 3 నిమిషాలకే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/indigo-airlines.jpg)
పట్నా (CLiC2NEWS): బిహార్ రాజధాని పట్నాలోని జయప్రకాశ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుండి విమానం టేకేఫ్ అయిన 3 నిమిషాలకే వెనక్కి వచ్చింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన 6ఇ 2433 విమానం ఢిల్లీకి బయలు దేరింది. ఈ విమానంలో 181 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే సాంకేతిక లోపాన్ని గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానంలోని ఒక ఇంజిన్ పనిచేయడం లేదని పైలట్ గుర్తించారు. దీంతో విమానాన్ని తిరిగి పట్నా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు సమాచారం.