రాష్ట్రపతితో ఒలింపిక్ క్రీడాకారుల సమావేశం
ఢిల్లీ (CLiC2NEWS): భారత ఒలింపిక్ క్రీడాకారులు రాష్ట్రపతి ద్రౌపదిముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్లో క్రీడాకారులంతా రాష్ట్రపతితో కాసేపు ముచ్చటించారు. పారిస్ ఒలింపిక్స్ ముగిసిన అనంతరం భారత్కు చేరుకున్న క్రీడాకారుల బృందం రాష్ట్రపతిని కలిశారు. ఒలింపిక్స్ పతకాలు సాధించిన మను భాకర్, పిఆర్ శ్రీజేశ్ లతో రాష్ట్రపతి కాసేపు మాట్లాడారు. ఆతిథ్యం ఇచ్చినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఏడు పతకాలు సాధించింది.