ఆల్‌టైమ్ గరిష్టానికి బంగారం ధర
హైదరాబాద్ (CLiC2NEWS): పసిడి ధర రోజురోజుకీ పెరుగుతూ ఉంది. దేశీయ ప్యూచర్ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. 10 గ్రాముల బంగారం ధర రూ.723 మేర పెరిగి రూ. 1,10,312కు చేరింది. దేశీయ మల్టీ కమెడిటి ఎక్సేంజ్(MCX)లో డిసెంబర్ డెలివరీ ధర రూ.1,10,312 ఉండగా.. అక్టోబర్ డెలివరీ బంగారం ధర రూ.1,09,500 లుగా ఉంది. అంతర్జాతీయ ప్యూచర్ మార్కెట్‌లో పసిడి ధర 3,698.02 డాలర్లుగా ఉంది.
ఇక హైదరాబాద్ లో గోల్డ్ రేటు 24 క్యారెట్స్ ధర రూ. 1,10,290 ఉంది. విజయవాడలో కూడా 24 క్యారెట్స్ స్వచ్చమైన బంగారం ధర రూ. 1,10,290 ఉంది. ఢిల్లీలో మాత్రం స్వచ్చమైన బంగారం ధర రూ. 1,10,440గా ఉంది.
Also Read: రూ.4లక్షల లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి
[…] ఆల్‌టైమ్ గరిష్టానికి బంగారం ధర […]