మ‌రింత దిగివ‌చ్చిన ప‌సిడి ధ‌ర‌..

ఢిల్లీ (CLiC2NEWS): దేశీయంగా  రూ.ల‌క్ష‌కు పైగా పెరిగిన పసిడి ధ‌ర‌.. దాదాపు రూ.7 నుండి 8వేల వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టింది. ఏప్రిల్ లో ఆల్‌టైమ్ గ‌రిష్టానికి చేరుకున్న బంగారం ధ‌ర క్ర‌మంగా ఇప్పుడిప్పుడే దిగొస్తోంది. అంత‌ర్జాతీయంగా డిమాండ్ త‌గ్గడంతో బంగారం ధ‌ర త‌గ్గుతున్న‌ట్లు స‌మాచారం. తాజాగా ఢిల్లీలో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.1800 మేర త‌గ్గి రూ.95,050 గా ఉంది. ఇక హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 99.5 శాతం స్వ‌చ్చ‌త క‌లిగిన ప‌సిడి ధ‌ర రూ.95,350 వ‌ద్ద కొన‌సాగుతుంది. వెండి ధ‌ర కూడా వెయ్యి రూపాయ‌ల మేర త‌గ్గి రూ.97వేలు ప‌లుకుతోంది.

Leave A Reply

Your email address will not be published.