ఆగస్టు 1 నుంచి పెరగనున్న పాదరక్షల ధరలు?
న్యూఢిల్లీ (CLiC2NEWS): సామన్యుడిపై ధరల బాంబ్. ఇప్పటికే నానాటికి నిత్యావసరాల దరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో పాదరక్షలకు సంబంధించి ఆగస్టు 1వ తేదీనుంచి కొత్త నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. 1 తరువాత తయారు చేసే ఫూట్ వేర్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్ స్పష్టం చేసింది. దీంతో ఆగస్టు 1 నుంచి షూస్, బూట్లు, స్లప్పర్లు, సాండిల్స్ లాంటి తదితర పాదరక్షల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్ ఉత్తర్వుల ప్రకారం పాదరక్షల తయారీదారులు is 6721, is 10702 నిబందనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ నాణ్యతా నిబంధనల ప్రకారం చెప్పుల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలకు కచ్చితంగా రసాయ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అలాగే ఆ వస్తువులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని చెప్పే నాణ్యత టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఉత్పత్తి దారులకు తయారీ ఖర్చులు పెరుగనున్నాయి. దాంతో ఆ భారాన్ని ఉత్పత్తి చేసే వస్తువుల ధరల పెంచే అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.